9,106 ఓట్ల‌తో ముందంజ‌లో టీఆర్ఎస్..

24
trs

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో కారు దూకుడుకు విప‌క్షాలు బెంబేలెత్తుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తుంది. ప్ర‌తి రౌండ్‌లోనూ టీఆర్ఎస్ భారీగా మెజార్టీగా దిశ‌గా దూసుకెళ్తుండ‌టంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకుపోతున్నారు. ప‌ద‌కొండో రౌండ్ ముగిసే స‌రికి 9,106 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి. ప‌ద‌కొండో రౌండ్‌లో టీఆర్ఎస్ కు 3,395, కాంగ్రెస్ పార్టీకి 2,225 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నికల అధికారులు ప్ర‌క‌టించారు.