బీజేపీలోకి వివేక్…క్రిషాంక్ సెటైర్

606
krishank trs
- Advertisement -

అంతా ఉహించిందే జరిగింది..ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి జంప్‌ అయ్యే మాజీ ఎంపీ వివేక్ తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వివేక్‌కు అమిత్‌ షా పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఇక వివేక్ పూటకో పార్టీ మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివేక్ బీజేపీలో చేరడంపై సెటైర్ వేశారు టీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్. 2012లో కాంగ్రెస్,2013లో టీఆర్ఎస్,2014లో కాంగ్రెస్,2016లో టీఆర్ఎస్ తాజాగా బీజేపీలో చేరారు. కనీసం ఈ పార్టీలోనైనా సంవత్సరం ఉంటారా అంటూ ప్రశ్నించారు క్రిశాంక్‌. ఇలాంటి వారికి అవకాశాలు కావాలి కానీ విశ్వాసంగా మాత్రం ఉండలేరు..ఈ స్వార్థ వ్యక్తా సీఎం కేసీఆర్‌ మీద పోరాడేది అంటూ ఫేస్ బుక్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు. ఇక నెటిజన్ల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు వివేక్‌.

- Advertisement -