పేదల భూములు లాక్కున్న దొంగ..ఈటల: కౌశిక్ రెడ్డి

265
trs
- Advertisement -

పేద ప్రజల భూములు లాక్కున్న దొంగ ఈటల రాజేందర్ అని మండిపడ్డారు టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి. తెలంగాణాకు అన్యాయం చేస్తున్న దుష్టులతో చేరి రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చాలని చూస్తున్నాడని ఆరోపించారు. హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కౌశిక్..ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనివ్వకుండా ముప్పతిప్పలు పెట్టిన మూర్కుడు ఈటల అని దుయ్యబట్టారు.

ఓడిపోతానని ఈటలకు అర్థమైందని, ఆ ఫ్రస్ట్రేషన్ తోనే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ గెలిచి ఏడేండ్లలో దేశానికి ఏం చేసింది? తెలంగాణకు ఏం చేసింది? ఇప్పుడు ఏం చేస్తుంది? తెలంగాణపై నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణలోని ఏడు మండలాలను ఎందుకు ఏపీలో‌ కలిపారు? అని ప్రశ్నించారు.

హామీల అమలుకు కేంద్రాన్ని అడగాలని హరీశ్ రావు అనటం తప్పా? హుజూరాబాద్ ప్రజల కోసం ఓ రూ. 5వేల కోట్ల ప్యాకేజీ ఢిల్లీ నుండి తీసుకురమ్మని అడిగారు. ఇది తప్పా? మంత్రిగా ఇండ్లు కట్టలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం అభివృద్ధి చేస్తారో? హుజూరాబాద్ ప్రజలకు చెప్పండని హరీశ్‌ అడగడం తప్పా అన్నారు. బీజేపీ నాయకత్వం పట్టించుకోక, ప్రజల నుండి ఆదరణ కరువై ఈటల రాజేందర్ ప్రస్టేషన్ లో హరీశ్ రావుపై పిచ్చికూతలు కూస్తున్నారని వ్యాఖ్యానించారు.

సొంత నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను పట్టించుకోని దద్దమ్మవు నువ్వు. రాష్ట్రంలో ఏ మూల నుండి వచ్చినా వాళ్ళ సమస్యను తీర్చే గొప్ప వ్యక్తి హరీశ్ రావు. సన్నాసుల పార్టీలో చేరగానే సన్నాసిలా వ్యవహరిస్తున్నావ్. అబద్ధాలు చెప్తున్నవ్, సంస్కారం వదిలేసి నువ్వూ ఓ సన్నాసిగా మారావు అని విమర్శించారు.

- Advertisement -