- Advertisement -
పేదల అభ్యున్నతే టీఆర్ఎస్ లక్ష్యమన్నారు మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్పేటలో పర్యటించిన హరీష్…డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్…పేదల అభ్యున్నతే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రతి పైసా పేదల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
మెదక్ పట్టణం శివారు లో పసుపులేరు వాగు మీద నిర్మించిన హైలేవల్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు హరీష్, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మేల్సి షేరి సుబాష్ రెడ్డి,జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి,స్ధానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -