యూఏఈ ఆమ్నెస్టీ బాధితులను తెలంగాణాకి తీసుకరావడానికి వెళ్లిన ప్రభుత్వ బృందంకు నిన్న దుబాయ్ లో,షార్జాలో తెలంగాణ వాదులనుండి ఘనస్వాగతం లభించింది.ప్రభుత్వ బృంద ఇంచార్జి అయిన అరవిందర్ సింగ్ తో పాటు మహేష్ బిగాల,రషీద్ ,చిట్టి బాబు,నర్సింహా నాయుడు పర్యటించారు.ఈ క్యాంప్స్ కి వందలాది మంది హాజరు అయ్యి వాళ్ళ సాధక భాధాకలు తెలిపారన్నారు.
ప్రభుత్వ బృందం వాళ్ళు చెప్పిన సమస్యలని పరిష్కరించాలని కాన్సులేటు జనరల్ ఆఫ్ ఇండియా విపుల్ ని కోరగా,విపుల్ ఓపెన్ హౌస్ స్టేడియం లో ప్రభుత్వ బృందం తో పాటు గల్ఫ్ బాదితులందరితో సమావేశం ఏర్పాటు చేశారు.ఆ సమావేశం లో రెండు వందల గల్ఫ్ బాధితులు హాజరు అయ్యారు.విపుల్ గల్ఫ్ బాధితులతో మాట్లాడి పాస్ పోర్ట్స్ లేని వారికీ త్వరగా పాస్పోర్ట్ ఇప్పిస్తామన్నారు,తెలంగాణ కి వచ్చేందుకు అవసరమైన అవుట్ పాసులు లేని వారికీ త్వరగా ఇప్పిస్తామన్నారు.
ఆమ్నెస్టీ ద్వారా తెలంగాణాకి రావాలనుకొనేవారు దాదాపు 500 పైగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ ప్రతినిధుల బృందం తెలిపింది. వీళ్ళందరికీ సీఎం కెసిఆర్ గారు ప్రభుత్వం తరుపున విమాన టికెట్స్ ఇప్పిస్తారన్నారు.మా సమస్యలు తీర్చడానికి ప్రత్యేకంగా తెలంగాణ నుండి దుబాయ్ కి బృందాన్ని పంపిన కెసిఆర్,కేటీర్ గారికి తెలంగాణ గల్ఫ్ సోదరులందరు రుణపడి ఉంటామని తెలంగాణ సంఘం సభ్యులు మరియు ఇతర సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.