- Advertisement -
తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.
40 ఫీట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం కేటీఆర్ కేక్ కట్ చేశారు. తెలంగాణ పాటలు, బాణాసంచా చప్పుళ్లతో తెలంగాణ భవన్ సందడిగా మారింది.
- Advertisement -