గల్లీ నుంచి ఢిల్లీ వరకు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు..

146
MP Vinod Kumar

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోందని టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ అన్నారు. సిరిసిల్లలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ గెలవబోతోందని ఆయన అన్నారు. కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రజలు కోరుతున్నారని అన్నారు.

రాజకీయ విలువలను బీజేపీ, కాంగ్రెస్ లు దిగజార్చాయని మండిపడ్డారు. పలు నియోజకవర్గాల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు బీజేపీకి ఓటు వేయాలని ప్రచారం చేశారన్నారు. కాగా వచ్చే పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.