ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అరుదైన రికార్డు..

266
Pochampalli Srinivas Reddy
- Advertisement -

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఓట్ల లెక్కింపు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో మూడు సీట్లను గెలుచుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.

అయితే ఇందులో టీఆర్ఎస్ అభ్యర్ధి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ ఎమ్మెల్సీగా చరిత్రత్మక గెలుపును సొంతం చేసుకున్నారు. రికార్డ్ మెజారిటితో ఘన విజయం అందుకున్నారు.వరంగల్ జిల్లా వరికొలు గ్రామాన్ని అభివృద్ధి చేసిన ప్రదాతగా శ్రీనివాస్ రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు పట్టం కట్టారు.

ఈ ఎన్నికల్లో 883 ఓట్లు పోల్ కాగా.. 848 ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పడ్డాయి. ఇక కనీస పోటీ ఇవ్వలేని కాంగ్రెస్ అభ్యర్ది ఇనుగాల వెంకట్రామిరెడ్డికి కేవలం 23 ఓట్లు మాత్రమే పొలయ్యాయి.మొత్తం పోలైన ఓట్లలో 96.06 శాతం ఓట్లు పోచంపల్లి దక్కించుకున్నారు.

దీంతో దేశంలోనే ఏడో రికార్డు దక్కించుకున్నారు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరూ ఊహించని మెజారిటీతో మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించారు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.

- Advertisement -