ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్..

457
Nomula Bhagath
- Advertisement -

తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కాగా తొలి రౌండ్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంలో ఉన్నారు. వ‌రుస‌గా తొలి నాలుగు రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. నాలుగో రౌండ్ ముగిసే స‌రికి 3,457 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు.

పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోల‌య్యాయి. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోల‌య్యాయి. నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు, కాంగ్రెస్ కు 3,202 ఓట్లు వ‌చ్చాయి. సాయంత్రం ఏడు గంటల వరకు అధి‌కా‌రి‌కంగా విజే‌తను ప్రక‌టించే అవ‌కాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -