నామినేషన్ వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్..

106
- Advertisement -

హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక‌ పోరు జోరందుకుంది. ఈ ఉప ఎన్నికకు ఈ రోజు నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ తొలి రోజే నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఆయన నామినేషన్ పత్రాలను తీసుకుని కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్లారు. ప్రత్యేక పూజల అనంతరం నేరుగా హుజూరాబాద్‌కు చేరుకుని ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ను సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ విజయ, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పాల్గొన్నారు.

కాగా, ఈ నెల 30న హుజూరాబాద్ కు ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నిన్న గెల్లు బీ ఫారం అందుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -