కరీంనగర్ మేయర్ గా సునీల్‌రావు

504
sunil Rao
- Advertisement -

కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ గా సునీల్ రావు పేరును ఖరారు చేసింది టీఆర్ఎస్ అధిష్టానం. సునీల్‌రావు వరుసగా నాలుగోసారి కార్పొరేటర్ గా గెలుపొందారు. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం మధ్యాహ్నం కరీంనగర్‌ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లకు గాను 2 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్దులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు.

sunil-rao_

58డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 33 డివిజన్లలో గెలుపొందింది. ఇక ఈ ఎన్నికల్లో గెలిచిన ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు నిన్న టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరి చేరికతో టీఆర్‌ఎస్‌ బలం 40కి చేరింది. ఈ ఎన్నికల్లో 60 స్ధానాలకు గాను టీఆర్ఎస్ 33 స్ధానాల్లో గెలుపొందగా, బీజేపీ 13, ఎంఐఎం 7, ఇండిపెండెంట్ 7గురు గెలుపొందారు.

- Advertisement -