సామాజిక రుగ్మతలపై యుద్దం…

206
Trs 16th Plenary Updates
- Advertisement -

సామాజిక రుగ్మతలు, సాంఘీక దురాచారాలు సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయని వాటిపై యుద్దం చేయాలని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో సామాజిక రుగ్మతలపై సమరం తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లక్ష్మణరావు  అస్థిత్వ ఆకాంక్ష స్వాతంత్య్రానికి దారితీస్తే.. ఆత్మగౌరవ ఆకాంక్ష తెలంగాణ ఉద్యమానికి దారి తీసిందన్నారు.

పేకాటతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. భార్య మెడలో ఉన్నటువంటి పుస్తెలను అమ్ముకునే పరిస్థితిని చూస్తున్నాం. పేకాట ఆట కాదు.. కుటుంబాలను కూల్చే ఆటం బాంబు అని పేర్కొన్నారు. పేకాటను ఆరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గుడుంబా, కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

మానవవనరులను తీర్చిదిద్దుకోకపోతే అభివృద్ధి, సంక్షేమ ఫలితాలు అందవు అని అన్నారు. సామాజిక రుగ్మతలను దూరం చేసేందుకు సంక్షేమ పథకాలను సీఎం తీసుకువస్తున్నారని స్పష్టం చేశారు. గుడుంబా, పేకాట, కల్తీ కల్లు, ఈవ్‌టీజింగ్ సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలు అని తెలిపారు. దుర్వాసనలను ఆరికట్టేందుకు సీఎం చర్యలు చేపట్టారు. ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు షీటీమ్స్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మహిళలు పని చేసే చోట వారికి రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్సీ నారదాసు ప్రవేశపెట్టిన సామాజిక రుగ్మతలపై సమరం తీర్మానాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత బలపరిచారు.

- Advertisement -