ప్చ్.. ‘హనుమాన్’ ఎఫెక్ట్, వారి పై ట్రోల్స్

25
- Advertisement -

యంగ్ హీరో తేజా సజ్జా ‘హనుమాన్’మూవీ ఆడియన్స్‌కు గూజ్‌ బంప్స్ తెప్పిస్తోంది. కేవలం 30 కోట్ల బడ్జెట్‌తో 100 కోట్ల విజువల్స్‌ని చూపించాడు డైరెక్టర్. దీంతో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌ను మరోసారి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. పాన్ ఇండియా స్టార్‌తో రూ. 600 కోట్ల బడ్జెట్‌ పెట్టి బొమ్మల గ్రాఫిక్స్ చూపించావని సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు, ప్రశాంత్ వర్మను చూసి నేర్చుకోండి అంటూ విమర్శిస్తున్నారు. మొత్తానికి హనుమాన్ మూవీ ఎఫెక్ట్ అటు త్రివిక్రమ్ – దిల్ రాజు లపై కూడా పడింది. చిన్న సినిమా అని చెప్పి చులకన చేశారు. ఇప్పుడు ఆ చిన్న సినిమానే పెద్ద విజయం సాధించింది, మీ పెద్ద సినిమానే అట్టర్ ప్లాప్ అయ్యింది అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

ఓం రౌత్, త్రివిక్రమ్ – దిల్ రాజు లపై ఇలా హనుమాన్ లవర్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా‘హనుమాన్’ మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అందరి ప్రశంసలను అందుకుంటోంది. సినిమా చూసిన వారంతా సూపర్ హిట్ అంటూ చిత్ర బృందానికి శుభకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ చిత్రంపై స్పందించారు. ‘మూవీ సూపర్ హిట్ అయినందుకు హనుమాన్ శుభాకాంక్షలు.. జై హనుమాన్’ అంటూ ట్వీట్ చేశారు. ‘హనుమాన్’ సినిమాపై ఆర్జీవీ ప్రశంసలు కురిపించడం మహేష్ ఫ్యాన్స్ కి అస్సలు నచ్చడం లేదు.

రామ్ గోపాల్ వర్మ కావాలనే మహేష్ బాబును అవమానిస్తున్నారు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. మరోవైపు ‘హనుమాన్’ ​సినిమాకు ఆడియెన్స్ నుంచి పాజిటివ్​ రెస్పాన్స్ వస్తుండటంతో.. హనుమాన్ సినిమా పై ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘హనుమాన్’​ సీక్వెల్ ఉందని తెలుస్తోంది. రెండో పార్ట్ ‘జై హనుమాన్​’ పేరుతో 2025లో ఈ సినిమా సెకెండ్ పార్ట్ రానున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 దక్కించుకుంది. ఓటీటీ రైట్స్‌ భారీ ధరకే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. హనుమాన్‌ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read:KTR:బీఆర్ఎస్‌ ఎప్పటికీ బీజేపీ టీం కాదు

- Advertisement -