ఐకాన్ స్టార్ ఆల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ పుష్ప పార్ట్ 1. ఈ మూవీ అటు నార్త్ లోనూ ఇటు సౌత్ లోనూ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నార్త్ లో అక్కడి స్టార్ హీరోలను సైతం తలదన్నెలా వసూళ్లు రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది. రా అండ్ రాస్టిక్ మూవీ గా రూపొంచిన ఈ మూవీని అన్నీ వర్గాల ప్రజలు ఆదరించారు. ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్ టేకింగ్.. అల్లు అర్జున్ యాక్టింగ్ ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళాయి. అల్ ఓవర్ ఇండియా వైడ్ గా సంచలనం క్రియేట్ చేసిన ఈ మూవీకి గాను అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ వరించింది. దీంతో అన్నీ ఇండస్ట్రీల నుంచి బన్నీ పై ప్రశంశలు కురుస్తున్నాయి.
ఇక 56 ఏళ్ల తరువాత మళ్ళీ తెలుగు సినిమా హీరోకి నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ రావడంతో తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా ఆనందం వెళ్లువిరిసింది. అయితే పుష్ప మూవీకి గాను బన్నీ కి నేషనల్ అవార్డ్ రావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు పై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే పుష్ప మూవీని మొదట మహేష్ బాబుతో తీద్దామని సుకుమార్ ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మహేష్ 26 వ చిత్రంగా తెరకెక్కాల్సి ఉంది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సుకుమార్ తో మూవీ చేయడం లేదని మహేష్ బాబు పుష్ప మూవీ నుంచి తప్పుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు పుష్ప మూవీలో అల్లు అర్జున్ క్యారెక్టర్ కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ వరించింది. దీంతో మహేష్ మంచి ఛాన్స్ మిస్ అయ్యాడని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరేమో మహేష్ బాబు ఆ మూవీ చెసుంటే ఫ్లాప్ గా నిలిచేదని, పుష్ప మూవీలో అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ మహేష్ కు సెట్ కాదని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఓ మంచి క్యారెక్టర్ మహేష్ బాబు మిస్ అయ్యాడనే చెప్పాలి.
Also Read:పొంగులేటి వైఖరితో కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్?