Trivkram:త్రివిక్రమ్ నెక్స్ట్ ఎన్టీఆర్ తోనే?

43
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం మూవీ తరువాత తన తరువాతి సినిమాను అల్లు అర్జున్ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గుంటూరు కారం మూవీ అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడం, త్రివిక్రమ్ డైరెక్షన్ పై విమర్శలు రావడంతో బన్నీ ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేసి తమిళ్ డైరెక్టర్ అట్లీతో మూవీ చేసేందుకు రెడీ అయ్యాడు. పుష్ప2 పూర్తవ్వగానే అట్లీ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెల్లెలా అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో త్రివిక్రమ్ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకానొక టైమ్ లో యువ హీరోలలో ఎవరో ఒకరితో త్రివిక్రమ్ మూవీ చేసే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపించింది. .

అయితే ఇప్పుడు మరో క్రేజీ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది, త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ వార్ 2 కోసం 60 కాల్షిట్లను కేటాయించినట్లు తెలుస్తోంది, ఆ తర్వాత త్రివిక్రమ్ తోనే మూవీ చేసే అవకాశాలు ఉన్నాయట. ఎందుకంటే ప్రశాంత్ నీల్ తో చేయాల్సిన ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే సలార్ 2 తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ ఇంట్రెస్ట్ చూపుతుండడంతో ఈలోగా త్రివిక్రమ్ తో మూవీ చేసి ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి గుంటూరు కారం స్థానంలో ఎన్టీఆర్ తో మూవీ చేయాల్సి ఉంది త్రివిక్రమ్. డిల్లీ బ్యాక్ డ్రాప్ లో అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ కూడా బాగానే వినిపించింది. కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు వార్ 2 తరువాత ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెల్లే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినికిడి. మరి ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.

Also Read:Allu Arjun: హ్యాపీ బర్త్ డే బన్నీ

- Advertisement -