త్రివిక్రమ్‌కు మాటల రచయిత కావాలట..!

207
trivikram ntr
- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ పరిచయం అక్కర్లేని పేరు. దర్శకుడిగా,మాటల మాంత్రికుడిగా ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను అంతకమించి మాటలను అందించాడు త్రివిక్రమ్‌. ఆయన నుంచి సినిమా వస్తుందంటే మినిమమ్‌ హిట్‌ గ్యారెంటీ. ప్రస్తుతం త్రివిక్రమ్‌ …యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌తో సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ డిఫరెంట్ లుక్‌లో కనిపించనుండగా ఇటీవలె సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.

అయితే,గతంలో తన సినిమాలు,డైలాగ్‌లు కాకుండా కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడట త్రివిక్రమ్. ఇందుకోసం కొత్త రచయితను వెతికే పనిలో ఉన్నాడట. ఎందుకంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లాంగ్వేజ్‌ రాయలసీమ భాషకు దగ్గరగా ఉండనుందని సమాచారం. అందుకే రాయలసీమ భాషపై పట్టున్న రచయితను వెతికే పనిలో ఉన్నాడట.

ఇందుకోసం గతంలో అత్తారింటికి దారేది సినిమాలో కోట శ్రీనివాస్ కోసం మాటలు రాసిన పెంచల్‌ దాస్‌ను త్రివిక్రమ్ సంప్రదించినట్లు తెలుస్తోంది. రాయలసీమ ముఖ్యంగా చిత్తూర్ భాషపై దాస్‌కు మంచి పట్టు ఉండటంతో త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇటీవల విడుదలైన నాని..కృష్ణార్జున యుద్ధం సినిమలో దాస్ రాసిన దారి చూడు అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

trivikram ntr

ఈ సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు కీ రోల్‌లో నటిస్తున్నాడు. ఫ్యాక్షన్ రాజకీయాల బ్యాక్‌డ్రాప్ తో తెరకెక్కుతుందని నాగబాబు చెప్పడం,త్రివిక్రమ్ సైతం సినిమాలో కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి.

- Advertisement -