చిరుతో త్రివిక్రమ్‌..?

209
- Advertisement -

చాలా రోజుల తరువాత మెగాస్టార్‌ చిరంజీవి ఖైదీ నెం150 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ సంక్రాతికి రిలీజ్‌ కాబోతుంది. వి.వి వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం చిరు..లక్ష్మీరాయ్‌ ఐటమ్‌ సాంగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ ఐటమ్ సాంగ్ సినిమాకే హైలెట్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇకు చిరు 150 పూర్తికాగానే వెంటనే మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యారనే వార్త ఫిల్మ్‌ నగర్‌లో జోరందుకుంది.

చిరు 151వ సినిమాను అల్లు అరవింద్‌ నిర్మిస్తారని, మాస్‌ యాక్షన్‌ చిత్రాలను దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని సమాచారం. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి చిరు నటించనున్నాడు. ఇప్పటికే పవన్‌తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్….తర్వాత చిరుతో 152వ సినిమా చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరు,త్రివిక్రమ్‌ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

చిరంజీవితో చాలా సినిమాలు నిర్మించి మెగా ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న అశ్వినీదత్ 152వ సినిమాను తెరకెక్కించారనే ప్రచారం జరుగుతోంది. ఓ వైపు త్రివిక్రమ్…మరోవైపు మెగా ప్రొడ్యూసర్ తోడాయడాన్న వార్తలతో అభిమానులు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే రూమర్స్పై మెగా క్యాంప్ ఎలాంటి ప్రకటనా వెలువడ లేదు. అయితే అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే బ్లాక్ బస్టరే అంటూ సంబరపడిపోతున్నారు.

- Advertisement -