ఉషా ప‌రిణ‌యం..షూటింగ్ పూర్తి

16
- Advertisement -

తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన కె.విజ‌య్‌భాస్క‌ర్ మ‌ళ్లీ ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా ప‌రిణ‌యం బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. విజ‌య్‌భాస్క‌ర్ క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపైకె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ త‌న‌యుడు శ్రీ‌క‌మ‌ల్ హీరోగా న‌టిస్తుండ‌గా, తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంది. గ‌త కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఐటెమ్‌సాంగ్‌ను హీరో శ్రీ‌క‌మ‌ల్‌, ప్ర‌ముఖ క‌థానాయిక సీర‌త్‌క‌పూర్‌పై చిత్రీక‌రిస్తున్నారు. ఘ‌ల్లు.. ఘ‌ల్లు అనే ఈ సాంగ్‌కు విజ‌య్ పొల్లంకి కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఆర్‌.ఆర్‌. ధ్రువ‌న్ సంగీతం అందించారు.

అయితే ఈ సాంగ్ చివ‌రి రోజు, చిత్రీక‌ర‌ణ‌కు చివ‌రి రోజు శుక్ర‌వారం ఈ చిత్రం షూటింగ్ జ‌రుగుతున్న సెట్‌కు స్టార్ రైట‌ర్ అండ్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ విచ్చేసి టీమ్‌కు ఆల్ ద‌బెస్ట్ చెప్పారు. త్రివిక్ర‌మ్‌, విజ‌య్‌భాస్క‌ర్ క‌ల‌యిక‌లో ఎన్ని సూప‌ర్‌హిట్ సినిమాలు వ‌చ్చాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్ చాలా రోజుల త‌రువాత క‌ల‌వ‌డం కూడా ఒక శుభ‌సూచ‌కం అని చెప్పాలి. ఈ ఐట‌మ్ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌తో షూటింగ్ పూర్త‌యిన‌ట్లుగా మేక‌ర్స్ ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల వారిని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది* అనే నమ్మ‌కం వుంద‌ని చిత్ర‌మేకర్స్ తెలియ‌జేశారు.

Also Read:స్కిన్ అలర్జీ..అయితే జాగ్రత్త!

- Advertisement -