నేచురల్ స్టార్ నాని ఇప్పటివరకు కొత్త దర్శకులు, అనుభవం లేని వారితోనే ఎక్కువగా పని చేశారు. అయినప్పటికీ వరుస విజయాలు అందుకుంటూ టాప్ రేసులో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. అతడు నటిస్తోన్న ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే త్వరలోనే నాని ఓ స్టార్ డైరెక్టర్ తో కలిసి పనిచేసే అవకాశాలున్నాయని సమాచారం.
ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నానితో సినిమా చేయమని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చాలా రోజుల క్రితం అడ్వాన్స్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్, నాని ఇద్దరూ తమ కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో వచ్చే ఏడాదిలో ఈ కాంబో సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించనున్నారని సమాచారం.అయితే ఎన్టీఆర్ సినిమా తరువాత త్రివిక్రమ్ చేయబోయే సినిమాపై ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
గతంలో ఎన్టీఆర్ సినిమా తరువాత త్రివిక్రమ్ మహేష్ బాబు లేదా వెంకటేష్‌లలో ఒకరితో సినిమా చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ యంగ్ హీరో నానితో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఎక్కువగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసే త్రివిక్రమ్ ఇటీవల నితిన్ హీరోగా అ..ఆ.. సినిమాను తెరకెక్కించాడు. ఇప్పుడు మరోసారి యంగ్ మరీ నానితో సినిమాను రూపొందిస్తున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది.