బన్ని త్రివిక్రమ్ మూవీకి ఎమోషనల్ టైటిల్

240
Trivikram Allu arjun
- Advertisement -

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ నాపేరుసూర్య నాఇల్లుఇండియా సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. సరైన కథతో బరిలోకి దిగాలని దాదాపు ఏడాది పాటు ఖాళిగా ఉన్నారు బన్నీ. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బన్ని సినిమా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రీప్ట్ పనిలో బిజీగా ఉన్నాడని సమాచారం. త్వరలోనే ఈచిత్రం రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా రష్మీక మందనను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈసినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇక త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్ కాస్త కొత్తగా ఉంటాయన్న విషయం తెలిసిందే. తెలుగు పేర్లను పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు త్రివిక్రమ్. అత్తారింటిది దారేది, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ.. ఇలా ఏ పేరు తీసుకున్నా చాలా కొత్తగా ఉంటుంది. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈసినిమాఉ “నాన్న నేను” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈసినిమాలో కూడా తండ్రి సెంటిమెంట్ ఉండటంతో ఈ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. బన్నికి కూడా ఈ టైటిల్ నచ్చడంతో ఫైనల్ చేశారని సమాచారం. బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ నటించిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -