మెగా ఫ్యాన్స్‌కి న్యూ ఇయర్ సందర్భంగా కిక్ ఇచ్చే వార్తను అందించారు చిరంజీవి. రామచరణ్-బోయపాటి కాంబోలో తెరకెక్కిన వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన చిరు త్వరలో తాను చేయబోయే సినిమా గురించి చెప్పేశారు.
పవన్ కళ్యాణ్‌కు అత్యంత ఆప్తుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో దానయ్య సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు నేను ‘యస్’ చెప్పేశా. ఈ కాంబినేషన్ సెట్ చేసింది మరెవ్వరో కాదు.. రామ్ చరణ్ అని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చారు చిరు.
త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని ఎప్పటినుండో ఉండేదని అది ఇప్పుడు నెరవేరిందన్నారు.రామ్ చరణ్ తాను దానయ్యతో సినిమాలు చేయ్యడమే కాకుండ నన్ను కూడా ఇరికించి సినిమా చేసేలా చేశాడని తెలిపారు. నాకు మంచి నిర్మాతను ఇచ్చాడు. త్రివిక్రమ్‌తో సినిమా అంటే చాలా మంచి అవకాశం. ఈ విషయం ఇక్కడ చెప్పడం సందర్భంగా కాదనుకున్నా. కానీ, ఆగలేక చెప్పేశా అని అన్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్నారని ఈ వార్త తెలిస్తే చాలా సంతోషిస్తాడని తెలిపారు.