రవితేజతో త్రివిక్రమ్.. నిజమేనా?

14
- Advertisement -

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీవ్రమైన నెగిటివిటీ ఫేస్ చేస్తున్నాడు. తన కెరీర్ లో అజ్ఞాతవాసి మూవీ చేదు అనుభవాన్ని మిగిల్చితే.. ఆ మూవీని మరిపించేలా మరింత గట్టిగా దెబ్బ తీసింది గుంటూరు కారం. ప్రస్తుతం మూవీకి కలెక్షన్లు బాగానే వస్తున్నప్పటికి.. త్రివిక్రమ్ మాత్రం పూర్తిగా డిస్సపాయింట్ అయినట్లు టాక్. ఎందుకంటే గుంటూరు కారం మూవీ కలెక్షన్లు మొత్తం మహేష్ స్టార్ డమ్ కారణంగానే వస్తున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక గుంటూరు కారం మూవీ తేడా కొట్టడంతో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై గందరగోళం నెలకొంది. నిజానికి గుంటూరు కారం మూవీ తర్వాత అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ఓ మూవీ చేయాల్సి ఉంది. .

వీరిద్దరి కాంబినేషన్ లో ఆల్రెడీ ఇప్పటికే మూడు సినిమాలు రాగా.. ఆ మూడు చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో నాలుగో సారి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ కావడంతో మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ గుంటూరు కారం ఫ్లాప్ కావడంతో ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా ప్రస్తుతం బన్నీ పుష్ప పార్ట్ 2 మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేందుకు మరో ఐదు నెలల సమయం పడుతుంది. ఈలోగా వేరే హీరో తో మూవీ చేసే ఆలోచనలో ఉన్నాడట గురూజీ. మాస్ మహారాజ్ రవితేజతో ఓ ఫుల్ లేన్త్ కామిడీ మూవీ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ ప్రాజెక్ట్ తో తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని చూస్తున్నాడట త్రివిక్రమ్. ఈ మూవీ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందించే అవకాశాలు ఉన్నట్లు టాక్. మరి ఈ ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కుతోందా లేదా అనేది చూడాలి.

Also Read:కంటి చూపు కాపాడుకోండిలా!

- Advertisement -