త్రిష కొంప ముంచేశారు..?

235
trisha
- Advertisement -

త్రిష ట్విట్టర్ వ్యాక్యపై ఇంకా వివాదంపై చలరేగుతూనే ఉంది. జల్లికట్టుకు వ్యతిరేకంగా త్రిష పోస్ట్ చేసిందంటూ అమ్మడుపై కొంతమంది తమిళులు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే త్రిష ట్విట్టర్‌ ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారని ఆమె తల్లి ఉమా కృష్ణన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం చెన్నై పోలీసు కమిషనర్‌ను కలిసిన ఆమె.. త్రిషను ఇబ్బందులకు గురి చేయాలన్న దురుద్దేశంతో ఎవరో ఆమె ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ చేసి జల్లికట్లుకు వ్యతిరేకంగా పోస్టు చేశారని ఫిర్యాదు చేశారు. జల్లికట్టుకు తాము వ్యతిరేకం కాదని ఆమె స్పష్టం చేశారు.

trisha

జల్లికట్టుకు వ్యతిరేకంగా త్రిష తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడులో సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టులో జంతువుల హింస ఎక్కువగా ఉందని.. సుప్రీంకోర్టు 2014లో నిషేధం విధించింది. జల్లికట్టు నిషేధంపై కొందరు మద్దతు తెలుపుతుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. పెట్టా కార్యకర్తగా ఉన్న త్రిష జల్లికట్టును వ్యతిరేకిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా  ప్రకటించారు. దీనిపై ఆగ్రహించిన కొందరు త్రిష చనిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పోస్టు చేసి శ్రద్ధాంజలి ఘటించారు. అయితే దీనిపై స్పందించిన త్రిష ఘాటుగా స్పందించారు. ఇలాంటి ఫోటో చూసి షాకయ్యాను. అలాంటి వారికి తమిళ సంప్రదాయం గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో త్రిష ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ అయిందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. నిజంగానే త్రిష ట్విట్టర్ హ్యాక్ చేసి అమ్మడు కొంప ముంచారా అనే సందేహాలు వస్తున్నాయి…

- Advertisement -