కొద్దిరోజులుగా సుచిత్ర లీక్స్ వ్యవహారం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. వారంరోజులుగా సుచిత్ర లీక్స్ కోలీవుడ్‌ని కుదిపేసింది. గత కొద్ది రోజులుగా సౌత్ సెలెబ్రిటీస్ కి సంబంధించిన ఫొటోలు,వీడియోలు.. ఇతర స్టార్లతో వారు చేస్తున్న రొమాన్స్ ఫొటోలు లీక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగానే త్రిష-రానా క్లోజ్గావున్న ఓ పిక్ బయటకువచ్చింది. అయితే ఇంత జరుగుతున్నా..ఆ స్టార్ల నుంచి ఎలాంటి రియాక్షన్స్ లేవేంటీ..? అని అందరూ అనుకుంటుండగానే ఈ వ్యవహారం పై నోరువిప్పేసింది త్రిష.
తాను ఎవరికి సమాధానం చెప్పాలనుకుంటుందో ట్విట్టర్ ద్వారా.. ఓ పోస్ట్ పెట్టేసింది ఈ అమ్మడు. ఆ లీకైన ఫోటో తనపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నవారికి సంబంధించినదని, వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని తన స్టైయిల్లో కౌంటర్ ఇచ్చేసింది. ఇక డీటైల్డ్ గా చెప్పాలంటే..త్రిష ‘కర్మ’ గురించి కోట్ చేసి ఇండైరెక్ట్ గా సుచి లీక్స్ గురించే స్పంధించింది.
‘పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు.కూర్చొని విశ్రాంతిగాచూస్తూ ఉండండి.మిమ్మల్ని బాధ పెట్టిన వారు..వారంతట వారే నాశనం అయిపోతారు. మీకు అదృష్టం ఉంటే..వాళ్ళ నాశనాన్ని మీ కళ్ళతో చూసే అవకాశం దేవుడు మీకిస్తాడు’ అంటూ ఘాటుగానే స్పందించింది త్రిష.
సింగర్ సుచిత్ర ట్విట్టర్ ద్వారా సెలబ్రిటీలు ఏకాంతంగా వున్న పిక్స్ బయటకురావడంపై సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా..తన వైఫ్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్‌ని ఎవరో హ్యక్ చేసి ఇలాంటివి పోస్ట్‌లు చేస్తున్నారని సుచిత్ర భర్త చెప్తున్నాడు. మొత్తానికి ఈ వ్యవహారం పై త్రిష స్పందించి తన వెర్షన్ చెప్పినట్లు.. మిగతా స్టార్లు కూడా స్పందిస్తారో లేదో చూడాలి.