సీనియర్ బ్యూటీ త్రిష కృష్ణన్ ఇండస్ట్రీకి వచ్చి దగ్గర దగ్గరగా రెండు దశాబ్దాలు అవుతుంది. సినిమాలు తగ్గించినా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ యాక్టిివ్ గా ఉంటుంది. పైగా ఈ మధ్య హీరోయిన్ గా మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. అయితే, త్రిష కృష్ణన్ మనసు పెళ్లిపై మళ్లిందనేది తాజాగా ఓ పుకారు వైరల్ అవుతుంది. ఇటీవల త్రిష కృష్ణన్ ఓ బిజినెస్ మెన్ తో ప్రేమలో ఉంది అంటూ పుకార్లు వైరల్ అయ్యాయి. ఇంతకీ, త్రిష ప్రేమించిన ఆ బిజినెస్ మెన్ చెన్నై కు చెందిన వ్యక్తి.
త్వరలోనే ఆ బిజినెస్ మెన్ ను పెళ్లాడేందుకు త్రిష కృష్ణన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అతనికి సినిమా ప్రొడక్షన్ పై కూడా బాగా ఆసక్తి ఉందట. పెళ్లి తర్వాత త్రిష కృష్ణన్ ఆధ్వర్యంలో అతగాడు పలు సినిమాలు కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకే, త్రిష కృష్ణన్ అతని పై మనసు పడిందని నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి గత మూడేళ్ళ నుంచే త్రిష కృష్ణన్ పెళ్లి అంటూ పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ, ఎందుకో త్రిష కృష్ణన్ కి తగ్గ సంబంధం దొరకడం లేదు.
Also Read:ఓటీటీ & థియేటర్స్ లో ఈ వారం !
దొరికినా త్రిష కృష్ణన్ లెక్కలకు వాళ్ళు సరితూగలేదు. అప్పుడెప్పుడో ఓ తెలుగు హీరోతో పీకల్లోతు ప్రేమలో పడి చాలా రోజులు పాటు నానిపోయింది. కానీ, ఆ హీరో త్రిష పై ఇంట్రెస్ట్ తగ్గగానే ఆమెను దూరం పెట్టాడు. ఆ తర్వాత ఓ యువ నిర్మాతతో త్రిష డేటింగ్ చేసింది. ఎంజిగ్ మెంట్ కూడా చేసుకుంది. కానీ, ఆ తర్వాత అతగాడి ప్రేమ నచ్చలేదో, లేక అతగాడి బ్యాంక్ బ్యాలెన్స్ నచ్చలేదో గానీ, ఫైనల్ గా అతనికీ త్రిష కృష్ణన్ హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత మధ్యలో కొన్ని ప్రేమ కథలు నడిపింది. అవన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. తాజాగా తన పెళ్లి గురించి త్రిష కృష్ణన్ సీరియస్ గా ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే ఈ కొత్త ఎఫైర్ ఏమో.