‘చిరు’తో లవ్ సీన్స్ కి త్రిష రెడీ

45
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ఐతే, విశ్వంభర సెట్‌ లోకి త్రిషను సాదర స్వాగతం పలికారు విశ్వంభర టీమ్. ఈ సందర్భంగా తీసిన ఫోటోను మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు. ఐతే, చిరు – త్రిష 18 సంవత్సరాల తర్వాత మళ్లీ ‘విశ్వంభర’లో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌ లో ‘త్రిష – చిరు’ల పై ప్రేమ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మరోపక్క, త్రిష మెగాస్టార్ సరసన నటిస్తే బాగుంటుంది అంటూ మెగా ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.

పైగా ఈ సినిమాని భారీ స్థాయిలో చేయబోతున్నారు. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి కొన్ని క్రేజీ అప్‌‌‌‌‌‌‌‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి మరోసారి డ్యూయెల్ రోల్‌‌‌‌‌‌‌‌ లో కనిపించనున్నారు. కాకపోతే, సెకెండ్ హాఫ్‌‌‌‌‌‌‌‌ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌‌‌‌‌‌‌‌ సీన్‌‌‌‌‌‌‌‌ లో మెగాస్టార్ చిరంజీవి ఓల్డ్ గెటప్‌‌‌‌‌‌‌‌ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అన్నట్టు త్రిష పాత్ర కూడా చాలా క్రేజీగా ఉంటుందట. యాక్షన్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌ డ్రాప్‌‌‌‌‌‌‌‌ తో పాటు ఫాంటసీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది. త్రిష పాత్రలో చాలా ఎమోషన్స్ ఉంటాయట.

అన్నట్టు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ క్యామిమో రోల్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారని, అలాగే స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌లో మిల్క్ బ్యూటీ తమన్నా, మరో కీలక పాత్రలో మరో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించనున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఐతే, వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి ఈ మెగా సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి త్రిష – చిరు పై ఓ సాంగ్ ను కూడా ఘాట్ చేయనున్నారు. ఇప్పటికే, ఈ సాంగ్ కోసం సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ ను వేస్తున్నారు.

Also Read:Congress:కాంగ్రెస్ లో సీట్ల లొల్లి.. షురూ!

- Advertisement -