Trisha:బాబోయ్.. త్రిష వదిలేలా లేదు

26
- Advertisement -

అన్నాడీఎంకే మాజీ నేత యూనియన్ సెక్రటరీ ఏవీ రాజుకు హీరోయిన్ త్రిష లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని త్రిష ఎక్స్ వేదికగా లీగల్ నోటీసులు పంపినట్లు పోస్ట్ చేసింది. నోటీసుల్లో తన గురించి రాజు మాట్లాడిన వీడియోల గురించి, అలాగే పలు న్యూస్ మీడియాలో వచ్చిన వార్తల లింక్‌లను కూడా యాడ్ చేశారు. ఏవీ రాజు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో త్రిష భారీ మొత్తంలో నష్టపరిహారం కోరినట్లు నోటీసులో తెలిపింది. మొత్తానికి అన్నాడీఎంకే నేతను త్రిష వదిలేలా లేదు.

మరోవైపు అన్నాడీఎంకే పార్టీకి కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఆ పార్టీ మాజీ నేతగా యూనియన్ సెక్రటరీగా ఏవీ రాజు గతంలో బాగా యాక్తివ్ గా ఉండేవారు. ఇప్పుడు ఆయన కామెంట్స్ ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇక ఏవీ రాజు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నటి కస్తూరి ఘాటుగా స్పందించారు. ”ఈ మధ్య సినిమా హీరోయిన్లపై విపరీతమైన దూషణలు పెరిగాయి. ఏమాత్రం నిజానిజాలు చూసుకోకుండా నోటికొచ్చింది వాగేస్తున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన వారందరూ మీ కంటికి వేశ్యల్లా కనిపిస్తున్నారా..?. ఇక నుంచి నోరు అదుపులో పెట్టుకుని ఆడపిల్లల గురించి కామెంట్లు చేయండి” అన్నారు.

అయితే, ఇప్పటికే హీరోయిన్‌ త్రిషకు అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు క్షమాపణలు తెలిపిన సంగతి తెలిసిందే. అసలు రాజు ఎందుకు ఈ కామెంట్స్ చేశాడు అంటే.. ఇటీవల అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే జీ వెంకటాచలాన్ని ఉద్దేశించి ఏవీ రాజు విమర్శలు చేస్తూ మధ్యలో హీరోయిన్‌ త్రిష వ్యక్తిగత జీవితంపై సంచలన కామెంట్స్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై త్రిష కూడా తీవ్రంగా మండిపడుతుంది. చివరకు ఈ వివాదం ఎటు వైపు వెళ్తుందో చూడాలి.

Also Read:ఆ రెండు గ్యారెంటీలు..ఎప్పటినుంచి అంటే?

- Advertisement -