దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి తన స్ట్రైట్ ఫార్వర్డ్ స్టైల్‌తో వార్తల్లో నిలిచారు. తన సినిమా కెరీర్‌పై వస్తున్న ఊహాగానాలకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సాటైరిక్‌గా కౌంటర్ ఇచ్చారు.
ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో నటుడు చిత్ర లక్ష్మణన్ …త్రిషా సినిమాలు మానేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది.ఈ వార్తలపై స్పందించిన ట్రిషా తన ఇన్‌స్టా స్టోరీలో వ్యంగ్యంగా ఇలా రాశారు.
అవును… నేను సినిమాలు మానేశాను. ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నాను. నలుగురు పిల్లలను కనేశాను. మీ ఊహాగానాలకు ఇది సరిపోతుందా? ఈరోజు మీరు వార్తలు రాసుకోవడానికి ఇది చాలదా? ఇంకేమైనా జోడించాలా? అని చురకలు అంటించారు.
త్రిషా చేసిన ఈ కామెంట్స్ నెటిజన్లలో వైరల్ అవుతున్నాయి. తప్పుడు వార్తలు, నిర్ధారణ లేని ఊహాగానాలపై ఆమె తనదైన స్టైల్‌లో వ్యంగ్యంగా స్పందించారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. త్రిషా స్పందనకు అభిమానులు భారీగా మద్దతు తెలుపుతున్నారు. “ఇలాంటి రూమర్స్‌కు ఇదే సరైన సమాధానం” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.


