తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్రకథానాయిక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ త్రిష. అయితే తర్వాత అవకాశాలు దక్కకపోవడంతో కొన్నిరోజులు సైలెంట్‌గా ఉన్న త్రిష తాజాగా పది సినిమాలతో తిరిగిరానుంది.
వీటిలో ఒక మలయాళం సినిమా కాగా ఎనిమిది తమిళ సినిమాలు, ఒక తెలుగు సినిమా ఉన్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో త్రిష నటిస్తున్నారు.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది త్రిష. వరుణ్ అనే బిజినెస్‌మ్యాన్‌తో కొంతకాలంగా డేటింగ్ చేసింది త్రిష. ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లి రద్దైంది.
ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానిమిస్తూ మీ బకెట్ లిస్ట్‌లో ఉన్న ఓ కోరికను చెప్పండి అని అడగగా ఇందుకు త్రిష స్పందిస్తూ.. లాస్ వెగాస్‌లో పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పుకొచ్చింది. అయితే ఆ మహా ఘట్టం ఎప్పుడు అని మాత్రం త్రిష చెప్పలేదు.