- Advertisement -
చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. కాగా చైనాలో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి 170 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మలేషియాలో కరోనా సోకి భారత యువకుడు మృతి చెందాడు. జీవనోపాధి కోసం మలేషియా వెళ్లిన ఓ భారతీయుడు ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు.
త్రిపురలోని పూర్తాల్ రాజ్ నగర్ గ్రామానికి చెందిన మానీర్ హోస్సేన్ (23) అనే వ్యక్తి రెండేళ్ల క్రితం మలేషియా వెళ్లాడు. అక్కడే ఓ రెస్టారెంట్ లో పని చేసుకుంటున్న ఆయనకు కరోనావైరస్ సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అయితే, ఆయన మృతి చెందినట్లు అక్కడి అధికారులు ఆయన తాత అబ్దుల్ రహీంకు సమాచారం ఇచ్చారు. ఆయనను భారత్కు రప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
- Advertisement -