అమ్మలా ప్రేమను పంచుతాడు. నాన్నలా బాధ్యత నేర్పిస్తాడు. అక్కలా జాగ్రత్తలు చెబుతాడు. తమ్ముడిలా పేచీ పెడతాడు. గురువులా కర్తవ్యం బోధిస్తాడు. జీవితభాగస్వామిలా కష్టసుఖాల్లో తోడుంటాడు. సృష్టిలో అందరి స్థానాన్నీ భర్తీ చేయగల ఒకే ఒక్కడు.. స్నేహితుడు. ఆ స్నేహితుడే అన్ని విధాలా మన జీవితాన్నీ ప్రభావం చేస్తాడు. అందుకేనేమో, అన్ని బంధాల్నీ పుట్టుకతోనే ఇచ్చే ఆ దేవుడు, అత్యుత్తమమైన స్నేహబంధాన్ని ఎంచుకునే అవకాశాన్ని మాత్రం మనిషికే వదిలేశాడు. ప్రేమలో విఫలమైనా, భాగస్వామితో సంతృప్తిగా లేకపోయినా, వ్యాపారంలో నష్టపోయినా, చదువులో వెనకబడినా… ఇలాంటి అనేక సందర్భాల్లో భావోద్వేగాలు అదుపులో ఉండవు. మనసుని కలవరపెట్టే ఆ కల్లోల స్థితి సద్దుమణగాలంటే స్నేహితుల సాయం కావాల్సిందే. మంచి స్నేహితుడులేని లోటు మనిషిని ఎంతటి స్థితికైన దిగజారుస్తుంది.
నేడు స్నేహితుల దినోత్సవం సంధర్బంగా ఫ్రెండ్‌షిప్ గురించి చంద్రబోస్ అందించిన అద్భుతమైన ఈ పాటలోని లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా, ఈ మూవీలోని ‘ఫ్రెండ్‌షిప్ ఆన్‌థెమ్’ను విడుదల చేశారు. ఈ సాంగ్‌ను కంపోజ్ చేసిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్, తనే స్వయంగా ఆలపించి, మరోసారి యూత్‌ను ఆకట్టుకున్నాడు.
https://youtu.be/eB0_ZPK83aw