యూ ట్యూబ్‌ ట్రెండింగ్‌లో ‘వాల్మీకి’

656
valmiki
- Advertisement -

వరుణ్‌తేజ్‌-హరీష్‌ శంకర్‌ తొలి కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాల్మీకి’. ప్రముఖ తమిళ్‌ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటివరకు డిఫరెంట్‌ జోనర్స్‌లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్‌ ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా మరో డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. మిరపకాయ్‌, గబ్బర్‌సింగ్‌ నుంచి డి.జె. వరకు ఎన్నో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన హరీష్‌ శంకర్‌ తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన జిగర్‌తాండ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసే విధంగా డిఫరెంట్‌గా ప్రజెంట్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. కాగా, ఈ సినిమాకి సంబంధించిన ప్రీ టీజర్‌ను జూన్‌ 24న విడుదల చేశారు. ఈ టీజర్‌లో వరుణ్‌తేజ్‌ గ్యాంగ్‌స్టర్‌ లుక్‌ చాలా కొత్తగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ప్రీ టీజర్‌తోపాటు అధర్వ లుక్‌ని కూడా విడుదల చేశారు. వరుణ్‌తేజ్‌, అధర్వ ఉన్న ఈ పోస్టర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సాధారణంగా డైలాగ్స్‌తో మ్యాజిక్‌ చేసే విధంగా హరీష్‌ శంకర్‌ సినిమా టీజర్‌ ఉంటుందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. దానికి భిన్నంగా ఒక్క డైలాగ్‌ కూడా లేకుండా ఈ ప్రీ టీజర్‌ను డిఫరెంట్‌గా క్రియేట్‌ చేసి బిగ్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేశారు హరీష్‌ శంకర్‌.

హరీష్‌ శంకర్‌ టేకింగ్‌, మిక్కీ జె.మేయర్‌ మ్యూజిక్‌, ఐనాంక బోస్‌ ఫోటోగ్రఫీ ఈ ప్రీ టీజర్‌కు ఎంతో గ్రాండియర్‌ లుక్‌ని తీసుకొచ్చాయి. ఈ ప్రీ టీజర్‌తో సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, సినిమాటోగ్రఫీ: ఐనాంక బోస్‌, ఎడిటింగ్‌: ఛోటా కె.ప్రసాద్‌, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల, స్క్రీన్‌ ప్లే: మధు శ్రీనివాస్‌, మిథున్‌ చైతన్య, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపి ఆచంట, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌

- Advertisement -