కొత్తబంగారులోకం సినిమాతో వెండితెరకు పరిచయమై మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్వేతా బసు. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ కి సరైన అవకాశాల్లేక కనుమరుగైపోయింది. ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుంది శ్వేతా ప్రసాద్. ఆ మధ్య సెక్స్ స్కాండల్ లో ఇరుక్కోవడం, తర్వాత ఆ కేసు నుండి విముక్తి పొందడం అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. ఈ సంఘటన తర్వాత శ్వేతా బసు హైదరాబాద్‌ను విడిచిపెట్టి ముంబై వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు రాలేదు ఈ నటి.
తాజాగా శ్వేత బసు మళ్లీ హైదరాబాద్‌లో కనిపించింది. గతంలో శ్వేతా బసు నటించిన మిక్చర్ పోట్లం అనే సినిమా ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈమూవీ ప్రమోషన్లో భాగంగానే హాజరైంది హీరోయిన్ శ్వేత బసు. అయితే ఈ వేడుకకు హాజరైన వాళ్లు శ్వేతబసు లుక్స్ చూసి షాకయ్యారు. అప్పటికీ ఇప్పటికీ శ్వేతా బసు చాలా మారిపోయిందని, ఆమె యాటిట్యూడ్, సెక్స్ అప్పీల్ మరింత ఆకర్షణీయింగా ఉందని, ఇపుడు హీరోయిన్ గా తెలుగులో ట్రై చేస్తే ఇండ్రస్ట్రీలో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని చూసిన సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.
అయితే కొందరు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు మళ్లీ తెలుగులో హీరోయిన్ చేయాలని అడిగారట….దానికి శ్వేతబసు నో చెప్పిందట. ఇక తన తెలుగులో సినిమాలు చేయదలుచుకోలేదని తేల్చి చెప్పిందట. దీని మాత్రం కారణం ఆమెకు గతంలో అవకాశలు ఇవ్వకపోవడంతో ఈనటి పక్కదారి పట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇవ్వని అవకాశలు ఇప్పుడు ఎందుకు అని ఆమె భావిస్తుందట.
గతంలో స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ శ్వేతబసు పట్టబడ్డటం అందరికీ తెలిసిందే. ఆ తదనతరం ఎర్రమంజిల్ కోర్టు ఆదేశాలతో రెస్క్యూ హోంకు తరలించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం ద్వారా ముంబై వెళ్లిపోయింది ఈ హీరోయిన్.