- Advertisement -
ఈ నెల 19వ తేదీన బీఆర్ఎస్వీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించనుననారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు హాజరుకానున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విషప్రచారాలను తిప్పికొట్టేందుకు అవసరమైన విషయాలను బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి తెలియజేయనున్నారు కేటీఆర్, హరీష్ రావు. ఈ నెల 19వ తేదీన ఉప్పల్‌లోని ఒక ఫంక్షన్ హాల్లో కేటీఆర్, హరీష్ రావు అధ్యక్షతన జరగనుంది శిక్షణ కార్యక్రమం.
ఇప్పటికే సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగడుతున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్. వారిపై తప్పుడు కేసులు పెడుతున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాత్రం ఆపడం లేదు.
Also Read:కార్తికేయ స్వామిగా తారక్!
- Advertisement -

