గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్బీస్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 4 గంటలకు బహిరంగసభ ప్రారంభంకానుండగా సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు.
టీఆర్ఎస్ సభ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని తెలిపారు పోలీసులు.
()పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు నుంచి బీజేఆర్ విగ్రహాం వైపు ట్రాఫిక్ అనుమతించరు, ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి చాపల్‌రోడ్డు, నాంపల్లి వైపు వెళ్లాలి.
()ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలు, హిమాయత్‌నగర్ వై జంక్షన్ వద్ద మళ్లిస్తారు.
()లిబర్టీ జంక్షన్ నుంచి అబిడ్స్ వైపు వచ్చే వాహనాలను, హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు.
()పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వెళ్లే వాహనాలు బషీర్‌బాగ్ నుంచి లిబర్టీ వైపు మళ్లిస్తారు.
()అబిడ్స్, గన్‌పౌండ్రీ వైపు నుంచి బీజేఆర్ విగ్రహాం వైపు వచ్చే వాహనాలను, ఎస్బీఐ గన్పౌండీ నుంచి చాపల్‌రోడ్డు వైపు వెళ్లాలి.
()బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి జీపీఓ వైపు వెళ్లే వాహనాలు బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్‌కోఠి రోడ్డులో వెళ్లాలి.