హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు…

21
traffic
- Advertisement -

హైదరాబాద్‌లో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఇవాళ ముగియనుండగా ఇందులో భాగంగా ఎల్బీస్టేడియంలో నిర్వహించనున్న గౌరవ వందనానికి సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు.దీంతో ఇవాళ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్బీస్టేడియం వైపు వెళ్లే రహదారులతో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

– నారాయణగూడ సిమెట్రి నుంచి బషీర్‌బాగ్‌ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద దారిమళ్లించి హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ మీదుగా అనుమతిస్తారు.

– కింగ్‌కోఠి, బొగ్గుల కుంట నుంచి బషీరాబాగ్‌, భారతీయ విద్యాభవన్‌ మీదుగా వెళ్లే వాహనాలను కింగ్‌ కోఠి ఎక్స్‌రోడ్డు వద్ద దారి మళ్లించి తాజ్‌మహల్‌, ఇడెన్‌ గార్డెన్‌ మీదుగా అనుమతిస్తారు.

– బషీర్‌బాగ్‌ నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్‌ వద్ద దారిమళ్లించి లిబర్టీ మీదుగా అనుమతిస్తారు.

– హిమాయత్‌నగర్‌ వై-జంక్షన్‌ నుంచి బషీర్‌బాగ్‌ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్‌ వై-జంక్షన్‌ వద్ద దారి మళ్లించనున్నారు.

– చాపెల్‌ రోడ్డు, నాంపల్లి నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ వద్ద దారి మళ్లించి పోలీసు కంట్రోల్‌ రూమ్‌ మీదుగా అనుమతించనున్నారు.

– గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ నుంచి ప్రెస్‌క్లబ్‌, బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్‌బీఐ వద్ద దారి మళ్లించి, చాపల్‌ రోడ్డు మీదుగా అనుమతిస్తారు.

– రవీంద్రభారతి, హిల్‌ ఫోర్ట్‌ రోడ్డు నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి మీదుగా దారిమళ్లించనున్నారు.

– బషీర్‌బాగ్‌ ఫ్లై ఓవర్‌ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్‌ విగ్రహం వద్ద కుడివైపునకు అనుమతించకుండా గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ వద్ద కుడివైపు దారిమళ్లించి చాపల్‌రోడ్డు మీదుగా అనుమతిస్తారు.

- Advertisement -