- Advertisement -
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు పొడగించారు. మార్చి 31 తో ముగియనుండటంతో మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని వెల్లడించిన హోంమంత్రి…ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు పెండింగ్ చలానా ఆదాయం వచ్చిందన్నారు.
ప్రజల నుంచి వస్తున్న స్పందన విజ్ఞప్తి మేరకు మరో పదిహేను రోజుల పాటు పొడగించామని…. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ-చలాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా తమ చలాన్ క్లియర్ చేసుకోవాలని సూచించారు.
- Advertisement -