గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు నుంచి సెప్టెంబర్ 5 వరకు ట్రాఫిక్ అంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఎన్టీఆర్ మార్క్, పీపుల్స్ ప్లాజా, PVNR మార్క్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
లిబర్టీ, ఖైరతాబాద్, పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. కవాడిగూడ, బేగంపేట్, మినిస్టర్ రోడ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా ట్రాఫిక్ మళ్లించారు.
సైలింగ్ క్లబ్ ‘టి’ జంక్షన్: కర్బలా మైదాన్ నుంచి అప్‌పర్ ట్యాంక్ బండ్ వైపు వాహనాలకు ఎంట్రీ లేదు. మళ్లింపు: కావడిగూడ క్రాస్ రోడ్డు → డీబీఆర్ మిల్స్ → ఇందిరా పార్క్ → అంబేద్కర్ విగ్రహం/తెలుగు తల్లి ఫ్లైఓవర్.
పంజాగుట్ట వైపు: రాణిగంజ్ → మినిస్టర్ రోడ్ → బేగంపేట్ → పంజాగుట్ట మార్గం ద్వారా వెళ్లాలి.
వీవీ విగ్రహం: పంజాగుట్ట/రాజ్ భవన్ నుంచి ఎన్‌టీఆర్ మార్గ్ వైపు ట్రాఫిక్‌ను నిరంకారి → ఓల్డ్ పీఎస్ సైఫాబాద్ → ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
తెలుగు తల్లి జంక్షన్: అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
తెలుగు తల్లి ఫ్లైఓవర్: ఇక్బాల్ మినార్ నుంచి ట్యాంక్ బండ్ వైపు ఎంట్రీ ఉండదు. మళ్లింపు: తెలుగు తల్లి ఫ్లైఓవర్ → కట్ట మైసమ్మ → డీబీఆర్ మిల్స్ → కావడిగూడ క్రాస్ రోడ్.
డీబీఆర్ మిల్స్: కట్ట మైసమ్మ/ధోబీ ఘాట్ నుంచి వచ్చే వాహనాలను కావడిగూడ క్రాస్ రోడ్ వైపు మళ్లిస్తారు.
Also Read:నటి ధన్సికతో విశాల్ ఎంగేజ్‌మెంట్!
కావడిగూడ క్రాస్ రోడ్: ముషీరాబాద్/జబ్బార్ కాంప్లెక్స్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను డీబీఆర్ మిల్స్ వైపు మళ్లిస్తారు.
నల్లగుట్ట వంతెన: మినిస్టర్ రోడ్ నుంచి వచ్చే వాహనాలను కర్బలా వైపు మళ్లిస్తారు.
బుద్ధభవన్: నల్లగుట్ట క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్‌ను మినిస్టర్ రోడ్ వైపు మళ్లిస్తారు.
అత్యవసర సహాయ ఫోన్ నంబర్: 9010203626

