ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా.. త్వరలో పిసిసి చీఫ్ పదవికి కూడా?

343
Uttamkumar Reddy Resign
- Advertisement -

టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2018డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన హుజుర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటివలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

నిన్న సాయంత్రం అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేశారు. దీంతో ఉత్తమ్ రాజీనామాను అమోదించారు కార్యదర్శి. త్వరలోనే హుజర్ నగర్ లో ఉప ఎన్నిక జరుగనుంది. హుజర్ నగర్ ఉప ఎన్నిక తెలంగాణలో చాలా హాట్ సాగనుంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్ధానం కావడంతో ఎలాగైనా ఇక్కడి నుంచి గెలవాలని టీఆర్ఎస్ భావిస్తుంది.

ఇక్కడ టీఆర్ఎస్ నుంచి శానంపూడీ సైదిరెడ్డి పేరు ఖారారు అయినట్లు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ భార్య మాజీ ఎమ్మెల్యే పద్మావతి పేరు వినిపిస్తున్నా పోటీ చేసేందుకు ఆమె సుముఖంగా లేనట్లు తెలుస్తుంది. ఇక త్వరలోనే పార్టీ అభ్యర్ధిని ప్రకటిస్తుందని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఉత్తమ్ తన పిసిసి ఛీప్ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. ఎంపీగా గెలవడంతో ఆయన ఢిల్లీలో కీలకంగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకు ఏఐసీసీలో మంచి పదవి కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -