రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహనదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
భారత్‌లో ఐమ్యాక్స్ థియేటర్లలో కూడా టాక్సిక్ విడుదల కానుంది. ఐమ్యాక్స్ అధికారిక ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ రిలీజ్ స్లేట్‌లో ఈ చిత్రం చోటు దక్కించుకుంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రీమియం ఐమ్యాక్స్ స్క్రీన్లపై ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం లభించనుంది.
అయితే ఐమ్యాక్స్ వెర్షన్‌పై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అయినప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలు, భారీ స్థాయి దృష్ట్యా దేశవ్యాప్తంగా ప్రధాన స్క్రీన్లలో విస్తృతంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో యశ్ ద్విపాత్రాభినయం చేయగా, నయనతార, కియారా అద్వాణి, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read:Modi:ప్రధాని మోదీ అరుదైన ఘనత..
కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ మరియు యశ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

