Toxic: ఫస్ట్ సింగిల్ అప్‌డేట్!

4
- Advertisement -

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా నటిస్తున్న చిత్రం టాక్సిక్. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం 2026 మార్చి 19న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ఫిబ్రవరి 28న ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

ఈ చిత్రంలో కియారా అద్వాని, రుక్మిణి వసంత్,నయనతార,హ్యుమా ఖురేషి, తారా సుతారియా వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ, యష్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తోంది.

రవి బస్రూర్‌తో పాటు విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.

Also Read:ఎక్స్ ట్రార్డినరీగా ‘సరస్వతి’!

- Advertisement -