భారీ వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను 15 అడుగుల వరకు ఎత్తి 3,76,670 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. గేట్లు ఎత్తడంతో శ్రీశైలం పరిసరాలన్నీ పర్యాటకులతో కిక్కిరిసిపోతున్నాయి. డ్యామ్ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. దాంతో ఘాట్ రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి.
శ్రీశైలం గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతోంది. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 3,95,162 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. అవుట్ ఫ్లో 4,36,902 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలు. ప్రస్తుతం జలాశయంలో 212.4385 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.
Also Read:Manda Krishna:ఈ విజయం వారికి అంకితం