రాజా ది గ్రేట్ సినిమాతో మాస్ రాజా రవితేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఇక ‘టచ్ చేసి చూడు’ అంటూ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు జెట్ స్పీడుతో థియేటర్స్‌కి దూసుకొచ్చాడు రవితేజ. తనకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రతో మరోసారి ప్రేక్షకుల ముందుకువచ్చిన మాస్ మహారాజా టచ్ చేసి చూడుతో హిట్ కొట్టాడా లేదా చూద్దాం..
కథ:
పాండిచ్చేరిలో ఉండే కార్తీకేయ(రవితేజ) బిజినెస్ మ్యాన్. తన ఫ్యామిలీకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ ఆనందంగా జీవితాన్ని గడుపుతుంటాడు. తనకు వచ్చే భార్య కూడా తమ ఫ్యామిలీని ఆనందంగా చూసుకోవాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో హీరోయిన్ పుష్ప(రాశీ ఖన్నా)ను కలుసుకుంటాడు. రాశీతో ప్రేమలో పడతాడు. కానీ రాశీఖన్నాకు కార్తీకేయ తన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం నచ్చదు. సీన్ కట్ చేస్తే రవితేజ పోలీస్‌గా ఎందుకు మారాడు..?చిన్నప్పటి ఓ మర్డర్ కేసుని ఎలా ఛేదిస్తాడు..?రాశీ ఖన్నాను సొంతం చేసుకున్నాడా లేదా తెరమీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ రవితేజ నటన,సాంగ్స్,బ్యాక్ గ్రౌండ్ సంగీతం. రవితేజ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా ఏసీపీగా తనకచ్చొచ్చిన పోలీసు పాత్రలో ఇరగదీశాడు. ఇటు పోలీస్‌గా అటు ఫ్యామిలీ ఎమోషన్స్‌లో ఇరగదీశాడు. పుష్పగా రాశీఖన్నా నటన బాగుంది. గ్లామరస్ పాత్రలో మెప్పించింది. మరో హీరోయిన్ సీరత్ కపూర్ తన పాత్రకు న్యాయం చేసింది.మురళీ శర్మ,వెన్నెల కిషోర్,గిరి తమ పరిధి మేరకు నటించారు.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ రోటిన్ స్టోరీ, స్క్రీన్ ప్లే. ఫస్టాప్ అంతా ఫ్లాట్ నేరషన్ తో నడిచిన ఇంటర్వెల్ బ్యాంగ్ హైలెట్ గా నిలిచిందని చెప్పుకోవాలి. ఆ ట్విస్ట్ తో సెకెండాఫ్ పై అంచాలు పెరుగుతాయి. కానీ సెకెండ్ ఆఫ్ లో కొత్తసీసాలో పాత సారాలా అలా నడిచిపోతుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. పాటలు బాగున్నాయి. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్. సినిమాను మరో మెట్టుకు తీసుకెళ్లింది.చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ సింప్లీ,సూపర్బ్. గౌతమ్ రాజు ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
గతంలో రవితేజ పోలీస్‌గా చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో కనిపించాడు. రవితేజ నటన,సాంగ్స్,మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ కాగా కథ, స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా డిఫరెంట్ కథను కొరుకునే వారిని కాస్త నిరుత్సాహపరిచే సినిమా టచ్ చేసి చూడు.
విడుదల తేదీ:02/02/2018
రేటింగ్:2.5/5
నటీనటులు:రవితేజ,రాశీ ఖన్నా,సీరత్ కపూర్
సంగీతం:ప్రీతమ్
నిర్మాత:నల్లమలుపు బుజ్జి
దర్శకత్వం:విక్రమ్ సిరికొండ