మాస్ మహారాజ రవి తేజ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మళ్ళీ రాజా ది గ్రేట్ గా మన ముందుకు వచ్చాడు. అంధుడిగా నటించిన రవితేజ తనలోని టాలెంట్ ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించాడు. అయితే ఇప్పుడు ‘టచ్ చేసి చూడు’ అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రవితేజ రెడీ అవుతున్నాడు. వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రవితేజ అభిమానులంతా ఆ తేదీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని .. యు/ఎ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది.
రేపు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటించిన ఈ సినిమాకి, ప్రీతమ్ సంగీతాన్ని సమకూర్చాడు. రవితేజ సరసన రాశిఖన్నా, శీరత్ కపూర్ కథానాయికలుగా అలరించనున్నారు. నల్లమలుపు బుజ్జి వల్లభనేని వంశీ నిర్మించిన ఈ సినిమా, తనకి భారీ హిట్‌ను ఇస్తుందనే నమ్మకంతో రవితేజ వున్నాడు.