- Advertisement -
అమెరికాలో తుపాను బీభత్సం సృష్టించింది. టోర్నడోలతో కెంటకీ, మిస్సోరీలు అతలాకుతలం కాగా 21 మంది మృతి చెందారు. కెంటకీలో 14, మిస్సోరీలో ఏడుగురు మృత్యువాత పడ్డారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావానికి ఐదు వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయని సెయింట్ లూయిస్ మేయర్ కారా స్పెన్సర్ మీడియాకు తెలిపారు.
విస్కాన్సిన్, ఇండియానా తదితర రాష్ట్రాల్లో తుపాను వల్ల భారీ విధ్వంసం చోటుచేసుకుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Also Read:మాన్సూన్పై మంత్రి పొన్నం రివ్యూ..
- Advertisement -

