ఇమ్యూనిటీ కోసం ఇవి తినాల్సిందే!

91
- Advertisement -

మన శరీరం ఎలాంటి రోగలనైనా ఎదుర్కొనేందుకు ఇమ్యూనిటీ చాలా అవసరం. ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటే రోగాలను, వ్యాధులను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో తరచూ ఎన్నో వ్యాధులు వేధిస్తూ ఉంటాయి. దగ్గు, జలుబు, తలనొప్పి,.. ఇలా చాలా సమస్యలే వేధిస్తూ ఉంటాయి. వీటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తి చాలా అవసరం. అందుకే రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు బాగా తినాలని ఆహార నిపుణులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు రోగ నిరోదక శక్తిని పెంచడంలో చాలా సహాయ పడతాయి. ఇవి పండ్లు కూరగాయలలో అధికంగా లభిస్తాయి. ఇమ్యూనిటీని పెంచడంలో సి విటమిన్ ఎక్కువగా సహాయ పడుతుంది. .

నారింజ, నిమ్మ, బచ్చలికూర, బ్రోకలి, బొప్పాయి, స్ట్రాబెర్రి, జామ వంటి వాటిలో సి విటమిన్ అధికంగా లభిస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వీటిని తరచూ ఆహార డైట్ లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. నారింజ, నిమ్మ, వంటివాటిలో సిట్రిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల అందులో ఉండే పోషకలు తెల్ల రక్త కణాల వృద్దిని పెంచుతాయి. ఇక ఆకు కూరలలో బ్రోకలి వంటి వాటిలో విటమిన్ సి తో పాటు ఫైబర్, విటమిన్ ఇ, వంటి సమ్మేళనలు కూడా అధికంగా ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయ పడతాయి. ఇంకా బలవర్ధకమైన ఆహార పదార్థాలలో రాగులు, ఒట్స్ వంటివి కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇంకా వీటితో పాటు వెల్లుల్లి, కొబ్బరి నీరు, టమోటా, హెర్బల్ టీ వంటివి కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయ పడతాయి. కాబట్టి ఈ చలికాలంలో వీటిని ఆహార డైట్ గా చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also Read:KTR: 4 నెలలైనా ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌పై చర్యలేవి

- Advertisement -