25 మంది కుబేరులు @ 100 లక్షల కోట్లు

459
mukesh ambani
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కుబేరుల ఆస్తి సెకన్లు,నిమిషాలు,గంటల్లో కోట్ల రూపాయలకు పెరిగిపోతోంది. అపర కుబేరుల ఆస్తుల వివరాలను పరిశీలిస్తే నిమిషానికి రూ. 49.72 లక్షలు, గంట్లలో రూ.28.41 కోట్లు, రోజుకు రూ.714 కోట్లు సంపద పెరిగిపోతూనే ఉంది. ప్రపంచ కుబేరుల్లో అగ్రస్ధానంలో ఉన్నారు రిటైల్ దిగ్గజం వాల్‌ మార్ట్ వ్యవస్థాపకుడు వాల్టన్‌. ఈ కుటుంబం సంపద గతేడాది జూన్ నుంచి చూస్తే వాల్టన్ల సంపద ఏకంగా 39 బిలియన్ డాలర్లు ఎగబాకి 191 బిలియన్ డాలర్లకు చేరింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25 సంపన్న కుటుంబాల సంపద విలువ 1.4 లక్షల కోట్ల డాలర్లు (భారత కరెన్సీలో రూ.100 లక్షల కోట్లు). చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ (జీడీపీ)ల విలువ కంటే ఇందులోని ఒక్కో కుటుం బం సంపద విలువే ఎక్కువగా ఉండటం విశేషం. భారతీయ అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సంపద కూడా 7 బిలియన్ డాలర్లు పెరిగి 50 బిలియన్ డాలర్లను దాటింది.

ఇక అమెరికా చాక్లెట్ల తయారీదారులైన మార్స్ కుటుంబీకుల సంపద 37 బిలియన్ డాలర్లు ఎగిసి 127 బిలియన్ డాలర్లను తాకింది. కోచ్ కుటుంబ సంపద 26 బిలియన్ డాలర్లు పెరిగి 125 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతెందుకు ఈ వార్తను చదివిన సమయంలోనే ఈ శ్రీమంతుల సంపద 23 వేల డాలర్లు (రూ.16.33 లక్షలపైనే) పెరిగిందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.

- Advertisement -