Rewind 2024: టాప్ 10 చెత్త సినిమాలివే!

7
- Advertisement -

భారతీయ సినీ పరిశ్రమలో ఈ సంవత్సరం ఎన్నో హిట్ సినిమాలు వస్తే మరికొన్ని చెత్త సినిమాలు కూడా వచ్చాయి. దీంతో బాలీవుడ్ ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాన్నే సొంతం చేసుకుంది. ఇక టాప్ 10 చెత్త సినిమాలను పరిశీలిద్దాం. ఇందులో మొదటిది అజయ్ దేవగన్.. ఆరోన్ మే కహన్ దమ్ థా. నీరజ్ పాండే ఈ సినిమాకు దర్శకత్వం వహించగా అజయ్ దేవగన్ – టబు కీలక పాత్ర పోషించారు. కథనం, అధ్వాన్నమైన సంగీతంతో బాక్సాఫీస్ వద్ద బోళ్తా పడింది.

2024లో అత్యంత నిరుత్సాహపరిచిన బాలీవుడ్ చిత్రాలలో మరోకటి చందు ఛాంపియన్. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన చిత్రంలో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించారు. యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వచ్చింది. బలహీనమైన స్క్రిప్ట్, కథ సినిమాకు మైనస్‌గా మారడంతో బాక్సాఫీస్ వద్ద బోళ్తా పడింది.

బడే మియాన్ చోటే మియాన్ . ఈ యాక్షన్-కామెడీ కోసం అక్షయ్ కుమార్ మరియు టైగర్ ష్రాఫ్ జోడీ కట్టారు. అయితే ప్రేక్షకులను మాత్రం అలరించలేక చెత్త సినిమాల్లో ఒకటిగా నిలిచింది. క్రాక్ – జీతేగాతో జియేగా! . భారతదేశపు మొట్టమొదటి ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్‌గా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా తీరా వెండితెరపై మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. బలహీనమైన కథాంశం, పేలవమైన పాత్రలు వెరసీ సినిమా పెద్ద నష్టాన్నే మిగిల్చింది. అలియా భట్ నటించిన జిగ్రా సైతం బాక్సాఫీస్ ను నిరుత్సాహ పర్చగా అజయ్ దేవగన్..మైదాన్ సైతం ఆకట్టుకోలేకపోయింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రం సైతం ప్రేక్షకులను థియేటర్‌కు తీసుకురాలేకపోయింది.

Also Read:మోక్షజ్ఞతో బాలయ్య ఆదిత్య 999 మ్యాక్స్!

మెర్రీ క్రిస్మస్… కత్రినా కైఫ్ మరియు విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం సైతం పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్ఫిరా. అక్షయ్ కుమార్, రాధిక మదన్, పరేష్ రావల్, సూర్య నటించారు. ఈ సినిమా సైతం డిజాస్టర్‌గా మిగలగా యోధా సినిమా సైతం ఇదే కోవలోకి వచ్చింది. ఖేల్ ఖేల్ మే సైతం బాక్సాఫీస్‌ను పూర్తిగా నిరాశపర్చింది. మొత్తంగా ఈ 10 సినిమాలు బాలీవుడ్‌లో చెత్త సినిమాలుగా మిగిలాయి.

- Advertisement -