Year Ender 2024: టాప్ 10 ఓటీటీ సిరీస్‌లు ఇవే

0
- Advertisement -

కరోనా తర్వాత దేశంలో ఓటీటీల హవా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఓటీటీల్లో పలు సిరీస్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇలా దేశంలో టాప్ 10గా నిలిచిన ఓటీటీల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.

అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన పంచాయితీ 3 టాప్ ప్లేస్‌లో నిలిచింది. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించగా ఇందులో జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా, సాన్వికా, చందన్ రాయ్, దుర్గేష్ కుమార్, అశోక్ పాఠక్, ఫైసల్ మాలిక్ కీలక పాత్ర పోషించారు. నగరంలో మంచి ఉద్యోగాలు లేకపోవడంతో ఒక గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా చేరిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చుట్టూ కథ తిరుగుతుంది.

డిస్నీ + హాట్ స్టార్‌లో వచ్చిన లైఫ్ హిల్ గయీ రెండో స్థానంలో నిలిచింది. పాత భవనాన్ని హోటల్‌గా మార్చే పనిలో ఉన్న ఇద్దరు వ్యక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జియో సినిమాలో వచ్చిన పిల్ సైతం మూడో స్థానంలో నిలిచింది. రితీష్ దేశ్‌ముఖ్, పవన్ మల్హోత్రా, అక్షత్ చౌహాన్, అన్షుల్ చౌహాన్, విక్రమ్ ధరియా మరియు హనీష్ కౌశల్ వంటి నటులు ఉన్నారు. సోని లైవ్‌లో వచ్చిన ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ ,గుల్లక్ సీజన్ 4 సైతం ఆకట్టుకున్నాయి.

జీ5లో వచ్చినా గ్యారా గ్యారా సన్‌ఫ్లవర్ సీజన్ 2 తర్వాతి స్థానాల్లో నిలవగా నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చి త్రిభువన్ మిశ్రా CA టాపర్ సైతం మంచి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాతి స్థానంలో జియో సినిమాలో వచ్చిన శేఖర్ హోమ్ సైతం ఆకట్టుకుంది. అలాగే సెక్టార్ 36 సైతం టాప్ 10లో చోటు దక్కించుకుంది.

Also Read:జాకీర్ హుస్సేన్ కన్నుమూత..

- Advertisement -