అక్టోబరు 5న తెరాస పార్టీ సర్వసభ్య సమావేశం జరగనున్న వేళ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌తో పాటు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు టీఆర్‌ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరగుతుంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్‌తో పాటు దేశం నుంచి నలుమూలల నుంచి పలువురు ప్రముఖ నాయకులు హాజరు కానున్నవేళ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ రంగనాథ్ వివరించారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
1 ఎన్టీఆర్ భవన్, అపోలో దవాఖాన, ఫిలింనగర్, బంజారాహిల్స్ వైపు వచ్చే వారు జుబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి రోడ్డు నెం.36, రోడ్డు నెం. 45 రూట్‌లలో వెళ్లాలని సూచించారు.
2 మాసబ్‌ట్యాంక్ నుంచి రోడ్డు నెం. 12 లోకి వెళ్లే వాహనాలను రోడ్డు నెం. 1, రోడ్డు నెం.10, జహీరానగర్, క్యాన్సర్ దవాఖాన నుంచి ఎన్టీఆర్ భవన్ వైపు వెళ్లాలని చెప్పారు.
3 ఫిలిం నగర్ నుంచి ఒరిస్సా ఐలాండ్‌కు వచ్చే వాహనాలు జుబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్‌ఎన్‌టీ, ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లాలి.
4 మాసబ్‌ట్యాంక్ నుంచి రోడ్డు నెం.12, జుబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనదారులు మెహిదీపట్నం, నానల్‌నగర్, టోలిచౌక్, ఫిలిం నగర్, జుబ్లీహిల్స్ వైపు వెళ్లాలి.